calender_icon.png 26 April, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

25-04-2025 10:34:49 PM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్...

నడిగూడెం: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(District Collector Tejas Nandalal Pawar) అన్నారు. శుక్రవారం మండలంలోని కాగిత రామచంద్రపురం గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇండ్ల నిర్మాణాల పరిశీలన సందర్భంగా నీలం శైలజ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆమెతో మాట్లాడుతూ... పునాది పూర్తి అవ్వగానే లక్ష రూపాయలు అకౌంట్ లో పడినాయా అని అడగగా లక్ష రూపాయలు వచ్చాయని యజమానురాలు సంతోషంగా కలెక్టర్ కి తెలిపారు.

గ్రామంలో బేస్మెంట్ లెవెల్  పూర్తి అయిన 35 మంది లబ్ధిదారులకు వారి అకౌంట్ లో లక్ష రూపాయల బిల్లులు జమ అయినట్లు హౌసింగ్ ఏఈ జై మూర్తి కలెక్టర్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్, ఆర్డీఓ సూర్యనారాయణ, ఎడిఎ యల్లయ్య, మండల ప్రత్యేక అధికారి సతీష్ కుమార్, తహసీల్దార్ సరిత, ఎంపిడిఓ సంజీవయ్య, పిఎసిఎస్ చైర్మన్ లు కొల్లు రామారావు, గోసుల రాజేష్, పంచాయతీ కార్యదర్శిలు ఉమారాణి, అనిల్  కుమార్ తదితరులు పాల్గొన్నారు.