calender_icon.png 23 January, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాల ఫలాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం

23-01-2025 12:38:02 AM

నారాయణపేట. జనవరి 22(విజయ క్రాంతి): ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ  సంక్షేమ పథకాల ఫలాలను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, పార్టీలు,వర్గాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలకు అర్హులకు అమలు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. నిరుపేదలను కాపాడుకోవా లని తపన తమ ప్రభుత్వానిదన్నారు. 

బుధ వారం మక్తల్ నియోజకవర్గం, మండలం లోని  కావ్ వార్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.  ప్రజల సాధక బాధకాలు, అభిప్రాయాలు తెలుసుకొని వారికి  ఏ రకంగా సేవ చేయాల ని గ్రామసభల ను నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు.

ప్రభుత్వం ముందే చెప్పినట్లు  200 యూనిట్లు విద్యుత్తు, ఉచిత  బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, ఇప్పుడు ఇందిరమ్మ పేరిట ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులను కూడా పరువులంద రికీ అందజేస్తామన్నారు. గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. జాబితాలో పేర్లు లేని వారు నిరాశ చెందకుండా అధికార యంత్రంగానికి దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. 

మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. గతంలో గ్రామ సభలు నిర్వహించలేని దుస్థితి ఉండేదని, ఇప్పుడు ఏకంగా మంత్రి ని ఆహ్వానించి, జిల్లా కలెక్టర్, ఎస్పీ పిలిచి గ్రామసభ నిర్వహిస్తున్నామని చెప్పారు. మీరు కోరుకున్న ప్రజా ప్రభుత్వంలో అర్హత కలిగిన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని భరోసా ఇచ్చారు. కాచ్ వార్ గ్రామానికి గత ఏడాది పాలన లో ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాల జాబితాను గణాంకాలతో ఎమ్మెల్యే సభలో వివరిం చారు.

కొడంగల్, నారాయణపేట నియోజక వర్గాల కంటే మక్తల్ నియోజకవర్గంలో అత్యధికంగా రూ. 3.41 కోట్ల రైతు రుణమాఫీ జరిగిందని చెప్పారు. జాబితాలో పేర్లు లేని వారు నిరాశ చెందవద్దని, గ్రామంలో వందకు వంద శాతం  ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందజేస్తామన్నారు. కాచ్ వార్ కి పెద్ద ఎత్తున ఇల్లు ఇస్తాం అన్నారు. గ్రామ యువత, కార్యకర్తలు ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులందరికీ పథకాలను వర్తింప చేయాలన్నారు.

కాగా అంతకు ముందు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరితో కలిసి మక్తల్ శివారులోని 916/2,917/2 సర్వే నంబర్ భూమిలో 150 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అంతకు ముందు మంత్రికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలమ్  పుష్ప గుచ్చాలిచ్చి స్వాగతం పలికారు.

అనంతరం మంత్రి మక్తల్ లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కొత్తగా మంజూరైన డయాలసిస్ సెంటర్ ను ఎమ్మెల్యే శ్రీహరితో కలిసి ప్రారంభించి, డయాలసిస్ వ్యాధితో చికిత్స కు వచ్చిన రోగులను ఆత్మీయంగా పలకరించారు.

ఈ కార్యక్రమంలో వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, డీజీఎంఐడిసి చీఫ్ ఇంజనీర్ దేవేందర్ కుమార్, ఎస్.ఈ. సురేందర్ రెడ్డి, ఈ ఈ జైపాల్ రెడ్డి, డీ.ఈ. కృష్ణమూర్తి,  ఆర్డిఓ రాం చందర్ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, మక్తల్ ఆస్పత్రి సమన్వయకర్త డాక్టర్ మల్లికార్జున్, తహసిల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ భోగి శ్వర్, ఇతర అధికారులు,  ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.