తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి
తుంగతుర్తి, జనవరి 23: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల రెడ్డి అన్నారు గురువారం నూతనకల్ మండల కేంద్రంలో జరిగిన ప్రజా పాలనలో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అర్హత కలిగిన వారి జాబితా ఆమెదించుకొనుట కొరకు నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో.
పాల్గొని మాట్లాడారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు.ఈ నాలుగు పథకాలో పేర్లు లేని వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొన్నారు ఎవరు అధైర్య పడవద్దని తెలిపారు. ప్రతి పేదవారికి లభ్దిచేకుర్చడమే ప్రభుత్వ లక్ష్యం పథకాలు సమర్ధవంతంగా అమలుచేసి రైతులు, పేదల కండ్లలో ఆనందం చూడడమే మన ప్రభుత్వం లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ చైర్మన్ నాగం జయసుధ రెడ్డి అధికారులు మురళిబాబు పాల్గొన్నారు