calender_icon.png 12 January, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టడుగువర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

12-01-2025 12:00:00 AM

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ 

మెదక్, జనవరి 11 (విజయక్రాంతి) : ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు జాబితా ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికా రులను ఆదేశించారు.

నిన్న రాష్ర్ట ముఖ్య మంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్సులో చర్చించిన  ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు, ఇంది రమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా  జిల్లాలో అమలు చేసే విధివిధానాలపై శనివారం కలెక్టరేట్ కా ర్యాలయంలో అధికారులతో సమీక్షించా రు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం సర్వే జిల్లాలో 96% కంప్లీట్ చేయడం జరిగిందని  అరత గల నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకం పగడ్బందీగా అమలు అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నా రు, రైతుల సంక్షేమం, నిరుపేద కుటుం బాల అభివృద్ధి కోసం రైతు భరోసా, ఇంది రమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల ప్యూరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

రైతు భరోసా పథకంలో అరులైన రైతుల వివరా లను క్షేత్రస్థాయిలో సమీక్షించి, లబ్ధిదా రుల పేర్లను జాబితాలో చేర్చాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అరులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలన్నారు. ప్యూరి ఫికేషన్ ప్రక్రియ 16వ తేదీ నుంచి ప్రారం భించి 20వ తేదీ నాటికి పూర్తిచేయాల న్నారు.

16వ నుండి 18వ తేదీ వరకు ఫీల్డ్ పనులు పూర్తి చేసి, 19వ తేదీ నాటికి కార్యాలయంలో సమీక్ష జరిపి, తుది జాబితాను 20వ తేదీకి సమర్పించాల న్నారు. 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి, తుది జాబితా ఆధారంగా లబ్ధిదారులను ఖరారు చేయా లన్నారు. 

ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు జయ చంద్ర రెడ్డి, రమాదేవి, మైపాల్ రెడ్డి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాస్, డీపీఓ యాదయ్య, డిఎస్‌ఓ సురేష్, అగ్రికల్చర్ అధికారి వినయ్, హౌసింగ్ పిడి మాణి క్యం, హౌసింగ్ డీఈలు, ఈఈలు, ఎంపీడీవోలు, వ్యవసాయ శాఖ ఏడీలు, ఏవోలు పాల్గొన్నారు.