దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్
దేవరకొండ, జనవరి 23, (విజయక్రాంతి): పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. గురువారం డిండి మండల కేంద్రంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. బొల్లనపల్లిలో గ్రామసభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, పథకాల ఎంపికలో రాజకీయాలకు తావులేదనీ, దశలవారీగా పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు,రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు.
కార్యక్రమంలో ఆర్డీఓ రమణా రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వర్ రావు, గడ్డమిది సాయి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.