calender_icon.png 2 April, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

01-04-2025 05:47:55 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేస్తున్న సన్న బియ్యం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, దళార్లకు విక్రయించకుండా వాడుకోవాలన్నారు. సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలకు మరింత లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మద్దెల స్వామి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బండారులాలు, మండల ప్రధాన కార్యదర్శి జనగామ మల్లారెడ్డి, నాయకులు  కాసిం, పడాల మల్లేశం, సంపత్ రెడ్డి, లక్ష్మణ్, యాదగిరి, తలారి సాయిలు,నర్సయ్య, తలారి నర్సింలు, స్వామి, కనక రెడ్డి, బాలు తదితరులు పాల్గొన్నారు.