calender_icon.png 19 March, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటలు ఎండుతున్నా పట్టించుకోని ప్రభుత్వం

19-03-2025 02:05:56 AM

మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత

జగిత్యాల అర్బన్, మార్చి 18 (విజయక్రాంతి): సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మాజీ జెడ్పి చైర్పర్సన్ దావ వసంత ఆరోపించారు. మంగళవారం జగిత్యాల రూరల్ మండలం హైదర్పల్లి గ్రామంలో నీళ్లు లేక ఎండిపోయిన లైశెట్టీ వెంకటేష్, జక్కుల వెంకటీ ల పంట పోలాలను దావ వసంత నాయకులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండిపోయిన పొలాలను మొరపెల్లి d53 కెనాల్ నుంచి నీళ్లు వెంటనే విడుదల చేసి కొన ఊపిరితో ఉన్న పొలాలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ ప్రజా పాలనలో రాష్ట్రంలో సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నా కనీసం పట్టించుకునే నాధుడే లేడని అన్నారు.

ఈ చేతగాని ప్రభుత్వంలో రైతన్నల జీవితం అస్తవ్యస్తమైందని అన్నారు. కేసీఆర్   ఉన్నపుడు  మండుటెండల్లో కూడా చెరువులు మత్తడి దూకాయని మళ్ళీ కేసీఆర్  వస్తేనే రైతు జీవితాలు బాగుపడతాయని రైతన్నలు ఆవేదనతో అంటున్నారన్నారు.ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు ఆనంద రావు, మాజీ సర్పంచ్ అంజయ్య, సీనియర్ నాయకులు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.