ఎంపీ డీకే అరుణ
వికారాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): లగచర్ల రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణమని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. సోమవారం ఆమె లగర్ల గ్రామంలో పర్యటించి ఇటీవల బెయిల్‌పై విడుదలైన రైతులను పరామర్శించారు. రైతులెవరూ అధైర్య పడవద్దని బీజేపీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
ఒక ప్రైవేటు కంపెనీ కోసం ప్రభుత్వం ఈ దుచ్చర్యకు పాల్పడినట్లు ఎంపీ ఆరోపిం చారు. ఈ సంఘటనలో 24 మందికి మాత్రమే బెయిల్ వచ్చిందని, మరో 15 మందికి బెయిల్ రావాల్సి ఉందన్నారు. మిగతావారికి కూడా త్వరలో బెయిల్ వచ్చేలా తనవంతు కృషి చేస్తానన్నారు.