01-04-2025 09:11:47 PM
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు..
హుజురాబాద్ (విజయక్రాంతి): పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని కందుగుల గ్రామంలో మంగళవారం తెల్ల రేషన్ కార్డుదారుల లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. ఎన్నికల హామీలో భాగంగా రేవంత్ రెడ్డి ఆడిన మాట తప్పకుండా రాష్ట్ర ప్రజలకు సన్నబియ్యం పంపించారని అన్నారు.- రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని,
త్వరలోనే రేషన్ కార్డుల పంపించేస్తామన్నారు. గతంలోవరి వేస్తే ఉరి అని చెప్పిన నాయకులు ఆశ్చర్యపడేలా ఇతర దేశాలకు సైతం సన్న బియ్యాన్ని ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఏదిగిందని అన్నారు.సన్న బియ్యం పంపిణీ ద్వారా రాష్ట్ర ఖజానా మీద 2,300 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో పేదవాడి ఆకలి తీర్చడానికి కృషి చేస్తుందని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 17,200 రేషన్ షాపులల్లో ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నామని,రానున్న రోజుల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు.ఒక్కొక్కటిగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామని,ప్రతిపక్ష నాయకులు చెప్పిన మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.