పాలకవర్గం ఆర్డర్ కాపీని అందజేస్తున్న ఎమ్మెల్యే
నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని పిట్ల మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మార్కెట్ కమిటీ చైర్మన్ గా చీకోటి మనోజ్ కుమార్ వైస్ చైర్మన్ గా మారెడ్డి కృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో వాటిని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో నమ్మకంతో రైతుల ప్రయోజనాల కోసం కృషి చేసేందుకు పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ గా చీకోటి మనోజ్ కుమార్ ను వైస్ చైర్మన్ గా మారెడ్డి కృష్ణారెడ్డిని నియమించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా పనిచేసే రైతులకు మంచి సేవలందించాలని వారికి ఎమ్మెల్యే సూచించారు. తమపై నమ్మకంతో పదవి కట్టబెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.