calender_icon.png 26 December, 2024 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిగివచ్చిన బంగారం

08-11-2024 01:17:02 AM

హైదరాబాద్‌లో రూ.1,790 తగ్గిన తులం ధర

హైదరాబాద్, నవంబర్ 7: డొనాల్డ్ ట్రంప్ విజయంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల అనిశ్చితి తొలగిపోవడంతో పపంచ మార్కెట్లో బంగారం ధర నిలువునా పతనంకావడంతో దేశీయ మార్కెట్లోనూ రూ.80,000 దిగువకు దిగివచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గురువారం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1790 తగ్గి రూ. రూ.78,560 వద్దకు చేరింది.

  22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర రూ.1,650 తగ్గుదలతో 72,000 వద్ద నిలిచింది.  అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ఫ్యూచర్ ధర 85 డాలర్ల పతనమై 2,675 డాలర్ల స్థాయికి పడిపోయింది. డాలర్, బాండ్ ఈల్డ్స్ భారీగా పెరగడంతో వీటికి ప్రతికూలంగా స్పందించే బంగారం పతనమయ్యిందని బులియన్ ట్రేడర్లు తెలిపారు.

దేశీయ జ్యువెలర్స్ నుంచి డిమాండ్ మందగించడం కూడా ధరల తగ్గుదలకు మరో కారణమని వివరించారు. యూఎస్ ఎన్నికల అనిశ్చితి తొలగిపోవడంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణించే బంగారాన్ని విక్రయించి, రిస్కీ సాధనాలైన బిట్‌కాయిన్, ఈక్విటీ మార్కెట్లలోకి నిధుల్ని తరలిస్తున్నారని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధి చెప్పారు. యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్, యూఎస్ డాలరు పెరగడంతో విలువైన లోహాల ధరలు తగ్గుతున్నాయని వివరించారు. 

రూ.3,000 తగ్గిన కేజీ వెండి

బంగారం బాటలోనూ వెండి ధర సైతం భారీగా తగ్గింది. గురువారం ఒక్కరోజులోనే హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.3,000 క్షీణించి రూ. 1,02,000 స్థాయికి పడిపోయింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర 4 శాతంపైగా పతనమై 31.5 డాలర్ల వద్దకు తగ్గింది.