గద్వాల మార్చురీలో ఘటన
గద్వాల(వనపర్తి), నవంబర్ 8 (విజయక్రాంతి): గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచిన మహిళ శవంపై ఉన్న బంగారం చోరీ అయిన ఘటన గురువారం రా త్రి జరిగింది. గద్వాల మండలం గో నుపాడు గ్రామానికి చెందిన మెరి స్సా అనే మహిళ గురువారం గద్వా ల పట్టణ సమీపంలో మృతి చెందిం ది.
గద్వాల పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచారు. మహిళ మెడలో రెండు బంగారు పుస్తెలు, నాలుగు బంగారు గుండ్లు, రెండు బంగారు చెవి కమ్మలు, ముక్కు పుడుక, కాళ్ల మెట్టలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా మృతదేహంపై ఆ వస్తువులు కనిపించడం లేదని ఆరోపిం చారు. మార్చురీలో పని చేస్తున్న సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై గద్వాల పోలీ సులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.