calender_icon.png 7 February, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోర్డు తిప్పేసిన బంగారం వ్యాపారి

07-02-2025 02:18:19 AM

  1. రూ.పది కోట్లతో ఉడాయించిన వైనం 
  2. లబోదిబో మంటున్న బాధితులు
  3. గోదావరిఖనిలో ఘటన

గోదావరిఖని, ఫిబ్రవరి 6: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీనాథ్ జువెలర్స్ యజమాని ఒకరు బోర్డు తిప్పేశాడు. స్థానిక లక్ష్మీ  చెందిన శ్రీనాథ్ జువెలరీ యజమాని తానాజీ జాదవ్ గత 40 సంవత్సరాల క్రితం గోదావరిఖనిలో స్థిరపడ్డాడు. సింగరేణి కార్మికులతో సత్ససంబంధాలు ఏర్ప ర్చుకుని వారి వద్ద నుంచి అప్పుగా సొమ్ము తీసుకుని బంగారం వ్యాపారం మొదలు పెట్టాడు. సమయానికి బ్యాంకు వడ్డీ కంటే కొంచెం ఎక్కువగా ఇస్తుండటంతో అందరూ అతడ్ని నమ్మారు.

ఈజీ మనీకి అలవాటు పడిన తానాజీ కుమారులు వ్యసనాలకు బా నిసై డబ్బులు వృథా ఖర్చు చేసేవారు. ఈ క్రమంలోనే తానాజీ అత్యధిక వడ్డీ ఇస్తానని పలువురి వద్ద సుమారు రూ.10 కోట్ల వరకు అప్పులు చేశాడు. ఒక్కొక్కరుగా అప్పులు తీ ర్చమని అడుగుతుండ  గురువారం అకస్మాత్తుగా  కనిపించకుండా పోయాడు.

వ్యా పారికి స్థిరాస్తులు ఉన్నాయి కదాని ప్రజలు ధైర్యంతో ఉండేవారు. కానీ వాటిని కూడా అమ్ముకొని ఊడాయించినట్టు తెలిసింది. వి షయం తెలుసుకున్న బాధితులు షాపు వద్ద కు చేరుకొని ఆందోళనకు దిగారు. గోదావరిఖని వన్-టౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని బాధితులతో మాట్లాడి.. చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితులు అక్కడి నుంచి కదలబోమ  బైఠాయించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.