calender_icon.png 18 January, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారు పతకం రాకపాయె.. ప్చ్ ప్లేసు జారిపాయె

02-09-2024 01:44:52 AM

సరిపోని ఆదివారం.. 

నేడు సుమిత్ పోరు

పతకాలు ఖాయం చేసిన పారా షట్లర్లు

రాకేశ్ కుమార్‌కు తృటిలో చేజారిన పతకం

పారిస్: పారాలింపిక్స్‌లో ఆదివారం రోజు భారత బృందంఓ పతకం సాధించినా కానీ పతకాల పట్టికలో భారత స్థానం దిగజారింది. మహిళల బ్యాడ్మింటన్‌లో ఇద్దరు భారత ప్లేయర్లు సెమీస్ చేరినా కానీ సెమీస్‌లో వారిద్దరి మధ్యే మ్యాచ్ ఉండడం గమనార్హం. దీంతో ఎవరో ఒకరు తప్పకుండా ఇంటికి రావాల్సిన దుస్థితి తలెత్తింది. 

పారా బ్యాడ్మింటన్‌లో..

మహిళల పారా బ్యాడ్మింటన్ పోటీల్లో విచిత్ర పరిస్థితి ఎదురైంది. మహిళల సింగిల్స్ ఎస్‌ఎల్ 3 క్వార్టర్‌ఫైనల్లో తలపడ్డ మన్‌దీప్ కౌర్ 8-21, 9-21 తేడాతో మరియం బోలాజీ (నైజీరియా) షట్లర్ చేతిలో పరాజయం పాలైంది. ఇక మహిళల సింగిల్స్ ఎస్‌ఎల్ 4 కేటగిరీ క్వార్టర్ ఫైనల్లో భారత క్రీడాకారిణి పాలక్ కోహ్లీ కూడా పరాజయం పాలయింది. మహిళల సింగిల్స్ ఎస్‌యూ 5 కేటగిరీలో మనీషా గెలిచి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. అలాగే మహిళల సింగిల్స్ ఎస్‌ఎహెచ్ 6 కేటగిరీలో నిత్య శ్రీ కూడా గెలిచి సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. కానీ ఎస్‌యూ 5 కేటగిరీలో భారత్‌కే చెందిన ఇద్దరు క్రీడాకారులు సెమీస్‌లో తలపడనున్నారు. మనీషా, మురుగేశన్ తులసీమతి ఇద్దరూ నేడు జరిగే సెమీస్‌లో పోటీ పడనున్నారు. 

అయ్యో అవనీ... 

మహిళల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్ 1 కేటగిరీలో స్వర్ణం నెగ్గిన అవని లేఖరా మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ ఎస్‌హెచ్ 1 విభాగంలో క్వాలిఫై అవ్వలేదు. ఈ ఈవెంట్‌లో పోటీ పడిన మరో భారత పారా షూటర్ బాబు కూడా క్వాలిఫై కాలేదు. క్వాలిఫై రౌండ్‌లో అవని 11వ స్థానంలో నిలవగా.. సిద్ధార్థ 28వ స్థానంలో నిలిచాడు. టాప్-8లో నిలిచిన పారాలు ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించారు. మహిళల 1500 మీటర్ల టీ11 షాట్ పుట్‌లో రక్షిత రాజు ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలం అయింది. పురుషుల షాట్ పుట్ ఎఫ్ 40 ఫైనల్ ఈవెంట్‌లో రవి పతకం సాధించడంలో విఫలం అయ్యాడు. ఈ పోటీల్లో రవి ఐదో స్థానంలో నిలిచి నిరాశపర్చాడు. ఆర్ 5 మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ ఎస్‌హెచ్ 2 క్వాలిఫికేషన్‌లో దేవరడ్డి రామకృష్ణ 26 స్థానంలో నిలిచాడు. మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచిన పారా షూటర్లు ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తారు. 

పారా ఆర్చరీలో..   

పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ కేటగిరిలో భారత్‌కు చెందిన రాకేష్ కుమార్ 1/8 ఎలిమినేషన్ రౌండ్‌లో విజయం సాధించి.. క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో కెనడాకు చెందిన కైల్ మీద విజయం సాధించి సెమీస్ చేరాడు. కానీ సెమీస్ పోరులో చైనాకు చెందిన క్సిన్‌లింగ్ మీద స్వల్ప తేడాతో ఓడిపోయాడు. దీంతో ఫైనల్ చేరుకోలేక కాంస్య పతక పోరుకు అర్హత సాధించినా కానీ తృటిలో పతకం చేజార్చుకున్నాడు.

మరో పతకం ఖాయం  

పారా బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం అయింది. భారత్‌కు చెందిన పారా షట్లర్ నితేష్ కుమార్ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్ 3 విభాగం సెమీఫైనల్లో 21-16, 21-12 తేడాతో దైసుకే (జపాన్) మీద గెలిచి ఫైనల్ దూసుకెళ్లాడు. నేడు జరిగే ఫైనల్లో నితేష్ బ్రిటన్‌కు చెందిన బెతెల్‌తో స్వర్ణ పతక పోరులో పోటీ పడనున్నాడు. ఒక వేళ ఈ మ్యాచ్‌లో నెగ్గినా, నెగ్గకపోయినా నితేష్‌కు పతకం మాత్రం ఖాయం. ఆదివారం పతకాలు రాని లోటును నితేష్ నేడు తీర్చనున్నాడు. మహిళల సింగిల్స్ డబ్ల్యూఎస్ 4 పారా టేబుల్ టెన్నిస్ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన పారా ప్లేయర్ భవీనా బెన్ పటేల్ రౌండ్ ఆఫ్ 16 పోటీల్లో విజయం సాధించింది. 

ఇంకో పతకం 

పారా బ్యాడ్మింటన్‌లో భారత్‌కు చెందిన యతిరాజ్ ఫైనల్ చేరుకున్నాడు. దీంతో భారత ఖాతాలో మరో పతకం చేరడం ఖాయమైంది. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్ 4 కేటగిరీలో భారత్‌కు చెందిన పారా షట్లర్ యతిరాజ్ భారత్‌కే చెందిన కదం సుకాంత్ మీద గెలిచి ఫైనల్ దూసుకెళ్లాడు. సెమీస్‌లో ఓడిన సుకాంత్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. 

పారా అథ్లెట్లతో ముచ్చటించిన ప్రధాని

పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ ఆదివారం ఫోన్‌లో సంభాషించారు. మనీష్ నర్వాల్, మోనా అగర్వాల్, ప్రీతి పాల్, రుబీనా ఫ్రాన్సిస్‌తో మోదీ ముచ్చటించారు. అవని లేఖరా పోటీలో పాల్గొనడం వల్ల ప్రధాని ఆమెతో ముచ్చటించలేదు. 

మరోమారు మెరిసిన ప్రీతి

మహిళల 200 మీటర్ల టీ35 పోటీ లో భారత అథ్లెట్ ప్రీతిపాల్ కాంస్య పత కం కొల్లగొట్టింది. దీంతో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరుకుంది. చైనా అథ్లెట్లు స్వర్ణ, రజత పతకాలు కొల్లగొట్టారు. 

1 పారా షట్లర్ నితేష్ 

కుమార్‌కు ఇదే తొలి పారాలింపిక్ పతకం.. 

పారాలింపిక్స్‌లో భారతీయం

పారా అథ్లెటిక్స్

పురుషుల డిస్కస్ త్రో 

ఎఫ్ 56 (ఫైనల్)

పురుషుల జావెలిన్ త్రో 

ఎఫ్ 64 (ఫైనల్)

మహిళల డిస్కస్ త్రో 

ఎఫ్ 53 (ఫైనల్)

పారా ఆర్చరీ

మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ 

ఓపెన్ (క్వార్టర్స్)

పారా బ్యాడ్మింటన్

మిక్స్‌డ్ డబుల్స్ ఎస్‌హెచ్ 

6 (కాంస్యపతక పోరు)

పురుషుల సింగిల్స్ 

(స్వర్ణ పతక పోరు)

పతకాల పట్టిక

దేశం స్వ కా మొత్తం

చైనా 30 25 10 66

బ్రిటన్ 23 12 8 43

బ్రెజిల్ 8 4 14 26

అమెరికా ౧౦ ౨౪

ఫ్రాన్స్ ౧౦ ౨౪

భారత్ 1

నోట్: స్వ-స్వర్ణం, ర-రజతం, కా-కాంస్యం