calender_icon.png 12 January, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోద్రా ఘటన నన్నెంతో కలిచివేసింది!

12-01-2025 12:34:47 AM

  • అప్పుడు నేను మూడు రోజుల ఎమ్మెల్యేను..
  • తొలి పాడ్ కాస్ట్‌లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జనవరి 11: ప్రధాని నరేంద్రమోదీ తొలి పాడ్ కాస్ట్ సంచలనం సృష్టి స్తోంది. మోదీ తన బాల్యం, రాజకీయాలు, విదేశీ సంబంధాలు తదితర అంశాలను పాడ్ కాస్ట్‌లో ప్రస్తావించారు. 2002 నాటి వివాదస్పద గోద్రా ఘటనను కూడా గుర్తుచేసుకున్నారు. ఈ పాడ్ కాస్ట్‌ను స్టాక్ ట్రేడిం గ్ యాప్ జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామ త్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సం దర్భంగా గోద్రా ఘటన గురించి మోదీ మా టల్లో.. “2002 ఫిబ్రవరి 24న తొలిసారి ఎ మ్మెల్యే అయ్యాను.

ఫిబ్రవరి 27న అసెంబ్లీకి వెళ్లా.. గోద్రా రైలు దహనం ఘటన జరిగినప్పుడు నేను మూడు రోజుల ఎమ్మెల్యేను. మొదట రైలులో మంటలు చెలరేగినట్లు మా కు సమాచారం అందింది. నేను సభలో తీవ్ర ఆందోళన చెందా.. బయటకు రాగానే గోద్రా కు వెళ్లాలని చెప్పా.. అప్పుడు అక్కడ ఒకటే హెలికాప్టర్ అందుబాటులో ఉంది. అది ఓఎన్జీసీ సంస్థది. అది సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ కాబట్టి వీఐపీలు ప్రయాణించడానికి అనుమతించలేమని సిబ్బంది చెప్పారు.

ఏం జరిగినా నేనే బాధ్య త వహిస్తానని చెప్పి అందులో గోద్రాకు వెళ్లా..” అని పేర్కొన్నారు. గోద్రాకు చేరుకున్న తర్వాత అక్కడ అత్యంత బాధాకరమైన దృశ్యాలను చూసి తనలో భావోద్వేగాలు చెలరేగాయన్నారు. తాను సీఎంగా ఉండటంతో భావోద్వేగాలను నియంత్రించుకో వాల్సి వచ్చిందని, తన సహజధోరణి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. తనను తాను కంట్రోల్ చేసుకున్నట్లు చెప్పారు.