‘దేవుడినైనా రాముడినైనా నడిపించేది ఆడదే’ అంటూ సాగుతున్న ఆ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాకు సంబంధించిందే ఆ వీడియో. సుహాస్ కథానాయకుడిగా రూపొందుతోందీ చిత్రం. అందరిని నవ్వించే యువకుడి చుట్టూ తిరిగే కథతో దర్శకుడు రామ్ గోదాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
హరీశ్ నల్ల నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుహాస్‌కు జంటగా మాళవిక మనోజ్ నటిస్తోంది. బుధవారం మేకర్స్ విడుదల చేసిన ఈ మూవీ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ‘నువ్వు నేను’ ఫేమ్ అనిత హస్సనందిని ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా ప్రభాస్ శ్రీను, ఆలీ, బబ్లు పృథ్వీరాజ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్ మణికందన్; సంగీతం: రథన్; ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి; ఎడిటర్: భవిన్ ఎం షా.