calender_icon.png 27 December, 2024 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి

27-12-2024 01:59:49 AM

* గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

మహబూబాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): విద్యార్థులు పాఠశాల దశలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, కష్టపడి చదవితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. కొత్తగూడ మండల కేంద్రంలోని గిరిజన బాలికల పాఠశాలలో బుధవారం రాత్రి ఆమె బస చేశారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులను మాత్రం మరిచిపోవద్దని సూచించారు.