calender_icon.png 19 February, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ శాఖ లక్ష్యం 2035

14-02-2025 01:23:48 AM

* భవిష్యత్ డిమాండ్‌కు అనుగుణంగా ప్రణాళికలు

* డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజంటేషన్

హైదరాబాద్, ఫిబ్రవరి 13(విజయక్రాంతి): భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని, 2035 నాటి విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలను రచించినట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చెప్పా రు. 

రాబోయే  వేసవిలో సన్నద్ధతతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ విద్యుత్ ప్రణాళికపై గురువారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఫిబ్రవరిలోనే మార్చిలో ఏర్పడాల్సిన డిమాండ్ ఏర్పడినట్లు చెప్పారు. డిమాండ్ పెరిగినా ఎలాంటి అంతరాయం లేకుండా కరెంట్ అందిస్తున్నామన్నారు. 

విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చామన్నారు. ఉత్పత్తిని మరింత పెంచేందుకు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాకు సమీపంలో ప్లాంటును ఏర్పాటు చెబోతున్నామన్నారు.  రాష్ట్రంలో విద్యుత్ వినియోగంలో 34శాతం వాటా వ్యవసాయానిదేనన్నారు. విద్యుత్ సబ్సిడీల కింద ఈ ఏడాది ఇప్పటి వరకు 18,000కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు.