calender_icon.png 19 April, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

08-04-2025 12:54:55 AM

  1. ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  2. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటన
  3. రూ.110 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకు స్థాపన, ప్రారంభోత్సవాలు 
  4. మూసీ నదిని ప్రక్షాళన చేసి, మురుగునీటిని తొలిగిస్తాం
  5. హాజరైన ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, కార్పొరేటర్లు 

ఎల్బీనగర్, ఏప్రిల్ 7: ప్రజా పాలన, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమ ని ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంత్రి  శ్రీధ ర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పర్యటించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీని అభివృద్ధి చేస్తామని, ప్రజలందరికీ మౌలిక, కనీస సౌకర్యాలు, వసతులు కల్పిస్తామని తెలిపారు.

సోమవా రం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపే ట, మన్సూరాబాద్, వనస్థలిపురం, లింగోజిగూడ, హస్తినాపురం డివిజన్ పరిధిలో పర్య టించి, రరూ. 118 కోట్ల 42 లక్షల 110 కోట్ల తో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మొదటగా కొత్తపేట డివిజన్‌లోని సప్తగిరి కాలనీలోని వార్డ్ నెంబర్లు 21, 22, 23ల్లో మొత్తం 16 పనులకు  శంకుస్థాపనలు, రూ. 16.41 కోట్ల నిధులతో చేపట్టిన 11 పనులను ప్రారంభించారు. 

హయత్ నగర్ సర్కిల్ పరిధిలోని ఎల్బీనగర్ పరిసర కామినేని జంక్షన్ 11, 12, 13, 14 వార్డుల్లో 29 పనులకు ప్రారంభోత్సవాలు, అలాగే రూ.34.18 కోట్ల తో చేపట్టనున్న 13 పనులకు శంకుస్థాపన చేశారు. లింగోజిగూడలో సీసీ రోడ్లు, బీటీ రోడ్డు, ఎస్డబ్ల్యూ డ్రైన్స్, కమ్యూనిటీ హాల్, ఓపెన్ జిమ్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. కొత్తపేట డివిజన్ రూ, 8.96 కోట్లు, చైతన్యపురి డివిజన్ రూ, 4.57  కోట్లు, గడ్డిఅన్నారం డివిజన్ రూ, 3.91 కోట్ల నిధులతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు.

ఆయా కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రతి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. జంట నగరాల్లో పెరుగుతున్న జ నాభా అనుగుణంగా గోదావరి నది జలాల ను అందిస్తామన్నారు. పేదలకు అన్యా యం చేయకుండా మూసీనది ప్రక్షాళన చేసి, మురుగు నీటిని తొలిగిస్తామని మంత్రి  చెప్పారు.

ఎల్బీనగర్ నియోజకవర్గంలో మధుయాష్కీ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, రానున్న జీహెచ్‌ఎం సీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిలో లక్షలాదిమందికి  ఉపా ధి కల్పించాలని సంకల్పంతో ముందుకు వెళుతున్న తరుణంలో కొంత మంది న్యా యస్థానాన్ని ఆశ్రయించారని, న్యాయం తమ వైపు నిలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు నమ్మకం వ్యక్తం చేశారు.

ఆయా కార్యక్రమాల్లో మల్కాజిగిరి ఎంపీ  ఈటల రాజేందర్, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దయా నంద్, కార్పొరేటర్లు పవన్ కుమార్, రంగా నర్సింహగుప్తా, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, కొప్పుల నర్సింహ రెడ్డి, నవజీవన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, సుజాత నాయక్, వంగా మధుసూదన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ పాటిల్ గారు, డిప్యూటీ కమిషనర్లు యాదయ్య, సుజాతతోపాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.