calender_icon.png 5 February, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని వర్గాల అభ్యున్నతి, దేశాభివృద్దే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం

05-02-2025 12:16:05 AM

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి,ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా, ప్రజారంజక బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి , ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ  శేరీలింగంపల్లి డివిజన్, మసీద్ బండ చౌరస్తాలో నరేంద్ర మోదీ చిత్ర పటానికి రాష్ట్ర నాయకులు, కార్యకర్తలతో కలసి పాలాభిషేకం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025 మోదీ ప్రభుత్వ 12వ పూర్తిస్థాయి బడ్జెట్ అని, 2014 నుంచి ఎన్నో సంస్కరణలు,ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని వాటి ఫలితాలు ఇవాళ స్పష్టంగా కనబడుతున్నాయాన్నారు, విద్య,వైద్యం, మౌలికవసతుల రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 95% పథకాలు తెలంగాణకు లబ్ధి చేకూరుస్తున్నాయి,

రాష్ట్రం అభివృద్ధికి కేటాయింపులు పెంచడం గర్వించదగ్గ విషయమన్నారు,ముఖ్యంగా  పేద మధ్య తరగతి కోసం రూ. 12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు,పీఎం ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్ల కోసం హెల్త్ కార్డులు, దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు, వృద్ధి కేంద్రాలుగా పట్టణాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక మిషన్, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా తెలంగాణకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.

మోడీ ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ,రాష్ట్రాల వాటా పన్నుల మొత్తాన్ని రూ.27 వేల కోట్ల నుండి రూ.30 వేల కోట్లకు పెంపుకు కృషి చేశారు,హైదరాబాద్కు ప్రత్యేక నిధులు అందిస్తూ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కిద రూ.10వేల కోట్లు అమృత్ పథకానికి రూ.10 వేల కోట్లు,125 కోట్లు అర్బన్ లొకల్ బాడీస్ అందించింది అన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగుల గౌడ్, ఎల్లేష్, ఆంజనేయులు సాగర్, కిషోర్,ఆకుల లక్ష్మణ్,మాణిక్ రావు, రమణయ్య, సత్యనారాయణ, శ్రీశైలం, వెంకటస్వామి రెడ్డి, రమేష్, శ్రీనివాస్ యాదవ్, రవి నాయక్, రాజు, గణేష్ ముదిరాజ్, శివారెడ్డి, బాబు ముదిరాజ్, ప్రేమ్, శ్రీనివాస్ యాదవ్, కుమార్ యాదవ్, రాయల్ పాల్గొన్నారు.