14-04-2025 01:51:13 AM
వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు
హనుమకొండ, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూనే మరోపక్క సంక్షేమ పథకాల అమలుచేస్తుందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.
ఖాజీపేట మండలం టేకులగూడెం గ్రామం నందు కాజీపేట దర్గా పీఏసీఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అనంతరం మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలైన తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు.
అందులో భాగంగానే సన్నాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాలు బోనస్ అందిస్తోందని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని, రైతులు తమ పంటను అమ్మిన రెండు మూడు రోజులలో డబ్బులు అందే విధంగా ఎప్పటికప్పుడు ఆన్ లైన్ చేయాలని నిర్వాహకులకు సూచించారు. వ్యవసాయ అధికారులందరూ రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలను తెలియజేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ వనం రెడ్డి, డిసిఓ సంజీవ రెడ్డి, ఏవో సంతోష్, ఎమ్మార్వో బావుసింగ్, కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, కాజీపేట మండల పార్టీ అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మెట్టుగుట్ట ఆలయ చైర్మన్ పైడిపాల రఘు చందర్, అర్జును గౌడ్, 64వ డివిజన్ అధ్యక్షుడు కుర్ల మోహన్, మహిళా మండల అధ్యక్షురాలు నీలం రజిని మండల, గ్రామ, స్థాయి నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.