calender_icon.png 20 April, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల కడుపునింపి, కష్టం రాకుండా చూసుకోవడమే ప్రజాపాలన ధ్యేయం

09-04-2025 01:42:00 AM

రేషన్ సన్న బియ్యం సహపంక్తి భోజనంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి 

 గజ్వేల్, మార్చి 8: పేదల కడుపు నింపి, కష్టం రాకుండా చూసుకోవడమే ప్రజాపాలన గేయమని డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్ లో మంగళవారం మాజి వార్డుమెంబర్  గుంటుకు లక్మీ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు  రేషన్ సన్న బియ్యంతో ఏర్పాటుచేసిన  సహపంక్తి   భోజనాన్ని నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆరగించారు . ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ సంపన్నులకు సామాన్యులకు ఒకే రకమైన భో జనం అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ  ప్రారంభించారన్నారు.

ప్రభుత్వం అమలు పరు స్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం  చేసుకోవాలని, అర్హులైన వారికి అందే విధంగా అధికారులు చర్యలు తీసు కోవాలని కోరారు.  ప్రజా పాలన, సంక్షేమం, రైతు సంక్షేమంతో, పాటు రాజీవ్ యువ వికాసం ఇంకా ఇతర పథకాలతో ప్రజా పాలన ప్రజల వద్దకు చేరువ అయ్యేవిధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మొనగారి రాజు , సుఖెందర్ రెడ్డి ,గుంటుకు ఆంజ నేయులు , మల్లేశం ,మహెష్ బిక్షపతి, వూడెం సారిక శ్రీనివాస్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్  ,సమీర్ ,జంగంరమేష్ గౌడ్, శివారెడ్డి,గాడిపల్లి శ్రీ ను , జాలిగామ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.