calender_icon.png 21 April, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త ఇండ్ల లక్ష్యం ప్రశంసనీయం

15-11-2024 12:00:00 AM

రాష్ట్రంలో పేదలకు మొత్తం 24 లక్షల కొత్త ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించడం అభినందనీయం. మొదటి విడతగా 5 లక్షల వరకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించడం ఆనందించదగ్గ విషయం. ప్రతీ ఏటా ఇండ్ల మంజూరు ఉంటుందని, కేవలం మహిళల పేరుతోనే జరుగుతుందనీ మంత్రి చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో పైరవీలకు తావు లేకుండా గ్రామసభలలో నిర్ణయించాలనుకోవడం కూడా హర్షణీయమే. ఏ ఏడాది ఇండ్లను ఆ ఏడాది పూర్తి చేయించి, వెంటనే ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. పూర్తయిన ఇండ్లను పెండింగ్‌లో పెట్టకుండా ప్రభుత్వం చూడాలి.

- గంగాధర్‌రెడ్డి, సంగారెడ్డి