10-03-2025 12:00:00 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, మార్చి 9 (విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఆదివారం గంగాధర మండలం కురిక్యాలలో ఆర్టీసీ బస్సులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ డిపో నుండి గంగాధర మండలం కురి క్యాల మీదుగా గర్శకుర్తి, బోయినపల్లి మండలం మర్లపేట, బోయినపల్లి నుండి వేములవాడ వరకు గతంలో ఆర్టీసీ బస్సును నడిపించిన అధికారులు.
ఆ తర్వాత నిలిపివేశారని అన్నారు. ఆర్టీసీ బస్సును నిలిపి వేయడంతో ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లడానికి గంగాధర మండల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారాణి, అంతేకాకుం డా మినీ సిరిసిల్ల గా పేరు పొందిన గర్శకుర్తి గ్రామంలోని నేత కార్మికులు వ్యాపార వాణిజ్య లావాదేవీల కోసం సిరిసిల్ల పట్టణానికి వెళ్లడానికి ఇబ్బంది పడ్డారని అన్నారు.
ఆర్టీసీ బస్సును పున: ప్రారంభిస్తే సిరిసిల్ల తో వ్యాపార వాణిజ్య అవసరాల కోసం వెళ్లడానికి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకోవడానికి సులభంగా వెళ్లడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అంతేకాకుండా కరీంనగర్ పట్టణానికి వెళ్లడం కూడా సులభతరం అవుతుందని అన్నారు. మహిళా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ర్ట ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని అన్నారు.
ఆర్టీసీ బస్సును ప్రారంభించడంతో గంగాధర, బోయినపల్లి మండలాల్లోని మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఆయా గ్రామాల ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్,దుబ్బాసి బుచ్చయ్య, బుర్గు గంగయ్య, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్, భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి, రోమల రమేష్, కర్ర బాపు రెడ్డి, కొల ప్రభాకర్, అలవాల నాగలక్ష్మి తిరుపతి ,రేండ్ల శ్రీనివాస్, దోమకొండ మహేష్, గంగాధర ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.