12-02-2025 12:36:21 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాం తి): హైదరాబాద్‌ను ఆవిష్కరణలకు హబ్‌గా మారుస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కొత్త ఆవిష్కణలతో ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. హెచ్‌ఐసీసీలో మంగళవారం జరిగిన ‘32వ హైసియా నేషనల్ సమ్మిట్ అండ్ అవార్డ్స్’ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని నిపుణులకు పిలుపునిచ్చారు. జీసీసీలకు కేంద్రంగా హైదరాబాద్ ను మార్చడమే లక్ష్యంగా ఇంతకుముందు పని చేసినట్టు చెప్పారు. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకేసి హైదరాబాద్‌ను గ్లోబల్ వ్యాల్యూ సెంటర్లు( జీవీసీ)కు కేంద్రం గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు.
టెక్నాలజీ అంటే ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సార థ్యంలోని తమ సర్కారు పనిచేస్తోందన్నారు. జీవీసీలు తెలంగాణకు అదనపు విలువను జోడిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీని ద్వారా హైదరాబాద్ ప్రపంచ టెక్నాలజీ పటంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని తెలిపారు.తెలంగాణ ఐటీ రంగ వార్షిక వృద్ధిరేటు 13 శాతానికిపైగా ఉందన్నారు.
తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ 32 బిలియన్ డాలర్లు కాగా.. దేశీయ ఐటీ అవుట్ పుట్ విలువ 5 బిలియన్ డాలర్లుగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదిగేందుకు ప్రణాళికలతో ముం దుకెళ్తున్నామన్నారు. గ్లోబల్ ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఇప్పుడు హైదరాబాద్ గ్లోబల్ లీడర్‌గా ఉన్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు.
సెమీ కండక్టర్లు, డీపీటెక్ సొల్యుషన్స్‌లోనూ తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఇప్పుడు 1500 ఐటీ కంపెనీలు ఉండగా.. వాటిల్లో 15 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని చెప్పా రు. అలాగే, 3 లక్షల మంది ఏఐ నిపుణులు, లక్షమంది చిప్ డిజైనర్లు ఉన్నారన్నారు.
ప్రతిభే తెలంగాణ ఆస్తి
తెలంగాణలో ప్రతిభకు కొదవలేదని, అదే తమ ఆస్తి అని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాకుం డా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూ డా విస్తరిస్తామని చెప్పారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు.
విదేశాలకు ముడి వస్తువులు, విడి భాగాలు సరఫరా చేయడానికే పరిమితం కాకుండా తెలంగాణలోనే పూర్తి వస్తువు తయారు చేసే విధంగా రాష్ట్ర సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఏఐ టెక్నాలజీ సామాన్యులకూ ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటు న్నా మన్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు కొత్త అవకాశాలు వస్తాయని వివరించారు. కార్యక్ర మంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హైసి యా అధ్యక్షుడు ప్రశాంత్ నందేలా తదితరులు పాల్గొన్నారు.