calender_icon.png 22 April, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యం

22-04-2025 12:08:27 AM

సూర్యాపేట , ఏప్రిల్ 21: భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వ రరావు అన్నారు. సోమవారం ఆ పార్టీ అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ...... సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు.

వక్ఫ్ బోర్డు చట్ట సవరణ పై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించాలన్నారు. పార్టీ బలోపేతానికి క్రియాశీల సభ్యత్వాలు పూర్తిచేసి మిగిలిన బూత్ కమిటీలు పూర్తి చేయాలన్నారు. జిల్లా సమావేశం అనంతరం మండలాల విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల న్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బిజెపిని కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.