calender_icon.png 3 April, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ బలోపేతమే లక్ష్యం

28-03-2025 12:00:00 AM

పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు

ఖమ్మం, మార్చి 27( విజయక్రాంతి ):-భారతీయ జనతా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా పనిచేయడం భాజపా జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అన్నారు. గురువారం సా యంత్రం ఖమ్మం త్రీ టౌన్ కార్యకర్తలు, నాయకులతో వన్ ఎలక్షన్ వన్ నేషన్ పై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కార్యకర్తలే మూలస్తంభమని, రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోవడమే పార్టీ లక్ష్యమని జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా పాల్గొన్న నల్లగట్ల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాబో యే ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు కార్యకర్తల కృషి కీలకమని స్పష్టంచేశారు.

ఈ సమావేశంలో ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజ య్య, జిల్లా ఎస్వీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోట మట్టి సుదర్శన్ , రాష్ట్ర బీజేవైఎం నాయకులు ఈదుల వీరభద్రం,బీజేవైఎం నాయకులు అంకతి పాపారావు, బిజెపి సీనియర్ మహిళా నాయకురాలు మందా సరస్వతి, త్రీ టౌన్ అధ్యక్షులు కొనతం లక్ష్మీనారాయణ గుప్తా, రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు తమ్మి అనిత తదితరులు పాల్గొన్నారు.