ఎంఎస్‌ఎంఈల వృద్ధికి అనుకూల వాతావరణం
- రాష్ట్రంలో కొత్తగా ౧౦ పారిశ్రామిక పార్కులు
- ఇందులో ౫ శాతం ప్లాట్లు మహిళలకు కేటాయింపు
- ౧౫ శాతం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రిజర్వ్
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాం తి): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణిస్తారు. ఇవి ఉపాధి కల్పనకు మాత్రమే కాకుండా స్థూల దేశీయోత్పత్తి, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక వృద్ధికి గణనీయంగా దోహదం చేస్తాయి. ఎంఎస్‌ఎంఈలు స్థిరమైన ఆర్థికాభివృద్ధిని అట్టడుగు స్థాయిలో వ్యవస్థాపకత ను ప్రోత్సహిస్తాయి.
దీంతోపాటు ఎంఎస్‌ఎంఈలు రాష్ట్రాల ఎగుమతులను పెంచడ మే కాక గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో వలసలను నిరోధించడంలో కీల కపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ పాలసీని రూ పొందించింది. ఈ విధానం ద్వారా ప్రధానమైన సమస్యలకు పరిష్కార మార్గాలను చూపిస్తుంది.
భూమి లభ్యత, రుణ సదుపా యం, ముడి పదార్థాల లభ్యత, కార్మిక నైపుణ్యత, మార్కెట్/వ్యాపార విస్తరణ, సాంకేతిక తకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించి, ఎంఎస్‌ఎంఈలు అభివృద్ధి చెందడానికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఈ పాలసీ రూపకల్పన జరిగింది. 6 కీలక సవాళ్లను పరిష్కరిం చడంతోపాటు వివిధ స్థాయిల్లో అవసరమై న మద్దతును అందించడానికి 40 విధాన పరమైన చర్యలను పరిశ్రమల శాఖ ఈ పాలసీలో ప్రతిపాదించింది.
సవాళ్లు.. పరిష్కారాలు
భూమి లభ్యత:ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ భూమిని ఎక్కువ ధర కు కేటాయిస్తున్నది. స్కేర్ మీటరుకు మహారాష్ట్రలో రూ.3,204లకు, గుజరాత్‌లో రూ.3,650కి భూమి లభిస్తుండగా తెలంగాణలోని సిద్దిపేట పారిశ్రామిక వాడలో స్కేర్ మీటర్‌కు రూ. 31,360, పటాన్‌చెరులో రూ.21,280, కరీంనగర్‌లో రూ.10 వేలకు కేటాయిస్తున్నది. మౌలిక సదుపాయాల సంస్థకు చెందిన 33 ఖాళీ ప్లాట్లలో దాదాపు 13 ప్లాట్లు హైదరాబాద్ నుంచి 2 గంటల దూరంలో ఉండటం వలన ఆహార పరిశ్రమ ల వ్యాపార నిర్వహణ, రవాణా, లాజిస్టిక్స్‌పై విపరీతమైన ఖర్చు పెరుగుతుంది.
పాలసీతో పరిష్కారం
10 కొత్త పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేయనున్నారు. వీటిలో ఒకటి మహి ళలల ఎంఎస్‌ఎంఈలకు, ఒకటి వినూత్న స్టార్టప్‌ల కోసం రిజర్వ్ చేస్తారు.
వాటిలో 5 శాతం ప్లాట్లు మహిళలకు, 15 శాతం ప్లాట్లు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రిజర్వ్ చేయనున్నారు.
ఎస్సీ, ఎస్టీ వ్యవస్థాపకులకు భూమి రాయితీ ధర 50 శాతంగా, పరిమితి 50 లక్షలుగా నిర్ణయించారు.
ప్రైవేట్ భాగస్వామ్యంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ సముదాయాలు, పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని ప్రోత్సహించడానికి స్టాంప్ డ్యూటీ రాయితీలు, భూమి రాయి తీ ధరలకి అందించనున్నారు. ప్రభుత్వం 119 నియోజకవర్గాల్లో మహిళల కోసం అన్ని సౌకర్యాలతో ఫ్లాటెడ్ సముదాయాలను నిర్మిస్తుంది. ఇది ఎస్‌హెచ్‌జీ మహిల ను చిన్న వ్యాపారస్తులుగా ప్రోత్సహిస్తుంది.
మూలధనం లభ్యత : ఎంఎస్‌ఎంఈలు బ్యాంకు రుణాల కోసం నిర్దేశించిన నిబంధనలను తీర్చడం కష్టంగా ఉన్నది. కొన్ని సంద ర్భాల్లో బ్యాంకులు రుణ విలువలో 200 శాతం వరకు పూచికత్తుగా అడుగుతాయి. 81 శాతం మైక్రో ఎంటర్‌ప్రైజెస్, 50 శాతం చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రుణాలు పొందడానికి 90 రోజుల కంటే ఎక్కువ కాల వ్యవధిని తీసుకోవడం ద్వారా వర్కింగ్ క్యాపిటల్ సవాలు ఎదుర్కొంటున్నాయి.
పాలసీతో పరిష్కారం:
- మూలధన పెట్టుబడి రాయితీ పెంపు కింద ఎస్సీ, ఎస్టీ వ్యవస్థాపకులకు 50 శాతం, పరిమితి రూ. కోటి (తయారీ యూనిట్లకు).
- ఇతర అన్ని ఎంఎస్‌ఎంఈలకు సబ్సిడీ 25 శాతం, పరిమితి రూ.30 లక్షలు.
- మహిళా పారిశ్రామికవేత్తలకు 20 శాతం అదనపు సబ్సిడీ, రూ.20 లక్షల అదనపు పరిమితి ఇవ్వనున్నారు.
ముడి పదార్థాల సమస్య: రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలకు తక్కువ ధరలకు నాణ్యమైన ముడి పదార్థాలు అందాల్సిన అవస రం ఉంది. గత రెండేళ్లలో దేశమంతటా ముడి సరుకు ధరలు భారీగా పెరిగాయి. పెరుగుతున్న వ్యయాలు 65 శాతం సూక్ష్మ, మధ్య తరహా సంస్థల్లో, 97 శాతం చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలోని 25 శాతం ఎంఎస్‌ఎంఈలు సరుకు సరఫరాలో వెనుకబడుతున్నాయి.
పాలసీతో పరిష్కారం:
- 10 జిల్లాల్లోని ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల చుట్టూ 10 కొత్త పారిశ్రామిక సౌకర్య కేంద్రాలు అభివృద్ధి చేయనున్నారు.
- పీపీపీ భాగస్వామ్యం కింద క్లస్టర్ ఆధారిత పరీక్షా సౌకర్యాలు అభివృద్ధి చేస్తారు.
- ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో ఒక గిడ్డంగి పీపీపీ నమూనాలో నిర్మిస్తారు. 100 శాతం స్టాంప్ డ్యూటీ తగ్గింపు, భూమి రాయితీ ధరలకు ఇవ్వనున్నారు.
- ముడి సరుకు దిగుమతిపై విధించిన సుంకం కూడా తిరిగి చెల్లించనున్నారు.
శ్రామిక కొరత: ఎంఎస్‌ఎంఈలకు నైపు ణ్యం కలిగిన కార్మికుల లభ్యత ఎంతో అవసరం. రాష్ట్రంలో అత్యధికంగా 76.7 శాతం యువత నైపుణ్యాలు కలిగి ఉన్నారు. 37.7 శాతం ప్రతిభావంతులకు మాత్రమే విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలున్నాయని ఒక సర్వేలో తేలింది. ఐటీఐల వంటి సంస్థల్లో నేర్చుకున్న నైపుణ్యం షాప్ ఫ్లోర్‌లో పనిచేయడానికి సరిపోవడం లేదు. రాష్ట్రంలో 5 నుంచి 6 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారు. సొంత రాష్ట్రానికి తిరిగే వెళ్లే వలస కార్మికుల నుంచి ఎంఎస్‌ఎంఈలు సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది.
పాలసీతో పరిష్కారం:
- యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అధునాతన తయారీ పద్దతులు, పారిశ్రామిక నిర్వహణ వంటి ఎంఎస్‌ఎంఈ కేంద్రీకృత కోర్సులు ప్రవేశపెట్టనున్నది.
- తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ప్లాట్‌ఫారంతో నైపుణ్యం గల అభ్యర్థులకు ఉపాధి, అప్రెంటిస్‌షిప్ అవకాశం.
- పారిశ్రామిక వాడల్లో వర్కర్ హాస్టళ్ల నిర్మాణాన్ని పీపీప పద్ధతిలో చేపట్టనున్నది.
- ఎంఎస్‌ఎంఈల కోసం కార్మిక చట్టానికి సంబంధించిన నిబంధనలు సరళీకృతం చేస్తుంది.
మార్కెట్ అనుసంధానం
తెలంగాణలోని ఎంఎస్‌ఎంఈలు ఈ ప్లాట్‌ఫామ్‌ల ను ఉపయోగించుకోవడం ద్వారా మార్కెట్ యాక్సె స్ పాటు స్థానిక మార్కెట్లకు మించి విస్త ంచడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని మధ్య తరహా సంస్థలు ఎగుమతి సంబంధిత నియమ నిబంధనలు, ప్రమాణాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులున్నాయి.
పాలసీతో పరిష్కారం:
- ఎంఎస్‌ఎంఈల నుంచి భారీ పరిశ్రమలు, ఉత్పత్తులను సేకరించి తగిన ప్రోత్సాహం అందించడం.
- బహుళ జాతి కంపెనీల సరఫరాలో భాగమైన అనుబంధ ఎంఎస్ ఎంఈలకు కూడా బహుళ జాతి కంపెనీల మాదిరిగానే ప్రోత్సాహాకాలు
- 25 శాతం ఎంఎస్‌ఎంఈల నుంచి ప్రిపరెన్షియల్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీని సిద్ధం చేస్తుంది.
- రూ.10 లక్షల వరకు ప్రోటోటైపింగ్ కోసం దిగుమతి చేసుకున్న నమూనాలపై సుంకం తిరిగి చెల్లిస్తుంది. మహిళల యాజమాన్యంలోని ఎంఎస్‌ఎంఈలకు రూ. 15 లక్షల వరకు తిరిగి చెల్లిస్తుంది.
సాంకేతిక సవాళ్లు..
రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలు ఉత్పత్తి ప్రక్రియలో సాంకేతిక సాధనాలను అనుసరించడం ద్వారా ఉత్పాదకత, సామ ర్థ్యం, వృత్తిపరమైన భద్రతను మెరుగుపరుస్తాయి. తెలంగాణలోని 25 శాతం ఎం ఎస్‌ఎంఈలకు మాత్రమే పారిశ్రామిక ప్రక్రియల ఆటోమేషన్ ఎంపికల గురించి, 10 శాతం వారికి మాత్రమే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి తెలుసు. అధిక ధరకు సాంకేతిక ఉపకరణాలు, సామగ్రి కొనడం సవాలుగా మారింది.
పాలసీతో పరిష్కారం:
- సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానం కోసం సమగ్ర సర్వే నిర్వహించి, నూతన పద్ధతులు, సంబంధిత యంత్ర సామగ్రిని అందుబాటులోకి తీసుకొస్తుంది.
- ఎంఎస్‌ఎంఈల్లో సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.100 కోట్ల నిధులను ఏర్పాటు చేయనున్నది.
- ఎంఎస్‌ఎంఈ క్లస్టర్‌లు, ఇండస్ట్రీయల్ పార్కుల్లో డిజిటల్ టెక్నాలజీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది.
- 100 శాతం ఐపీఆర్ రిజిస్ట్రేషన్ ఖర్చు రీయింబర్స్ చేయనున్నది.