10-04-2025 02:37:31 AM
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యమని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో సం ఘం కార్యాలయంలో లచ్చిరెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో అన్ని విభాగాల ప్రభు త్వ ఉద్యోగులు హాజరై సమస్యలపై చర్చించా రు. అనంతరం 37 ప్రధాన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వ సలహాదారు, క్యాబినెట్ సబ్‌కమిటీ సభ్యులు కే కేశవరావు, జీఏడీ కార్యదర్శి రఘునందన్‌రావుకు అందజేశారు.
జేఏసీ ఇచ్చిన వినతిపత్రంపై కేకే సాను కూలంగా స్పందించారని, ఉద్యోగుల సమస్యలపై త్వరలోనే నిర్వహించే క్యాబినెట్ సబ్‌కమి టీలో ఓ నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని లచ్చిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదురహిత చికిత్స, బిల్లుల క్లియరెన్స్, ఈ ద్వారా గ్రీన్ ఛానెల్ ద్వారా రూ.10 లక్షల అందజేత, ప్రతినెలా మేలో సాధారణ బదిలీ లు తదితర 37 డిమాండ్లను ఉద్యోగ సంఘా లు వినిపిస్తున్నాయి.