03-04-2025 12:07:30 AM
మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్
వేములపల్లి, మార్చి 2 : నిరుపేదల ఆకలి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీని ప్రారంభించినట్లు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్ స్పష్టం చేశారు. దామరచర్ల మండలం వాడపల్లి, అడవిదేవులపల్లి, మిర్యాలగూడ 6వ వార్డు పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, బాపూజీ నగర్లలో బుధవారం లబ్ధిదారులకు వారు సన్నబియ్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దొడ్డు బియ్యం తినడానికి అనువుగా లేకపోవడంతోపాటు పక్కదారి పడుతుండడంతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ పథకంతో ప్రభుత్వ ధనం వృథాకు అడ్డుకట్ట పడడంతోపాటు పేదల ఆకలి తీరుందని ధీమా వ్యక్తం చేశారు. సన్న బియ్యం పంపిణీతో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి అని మరోసారి నిరూపించుకుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్ల బండిలా సాగుతుందని పేర్కొన్నారు. రేషన్ కార్డుదారులంతా సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.