calender_icon.png 11 January, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యం

11-01-2025 01:38:36 AM

  1. రిపబ్లిక్ డే నుంచి రైతు భరోసా 
  2. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, జనవరి 10 (విజయక్రాంతి): రిపబ్లిక్ డే నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తమ ప్రభుత్వం లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో మంత్రి పర్యటించారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానం ద్‌తో కలిసి బుగ్గపాడు, కాకర్లపల్లి గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాకర్లపల్లి గ్రామంలో నిర్మించిన కో ఆపరేటివ్ సొసైటీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జనవరి 26 నుంచి రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో దాదాపు రూ.10వేల కోట్లు  జమ చేయబోతున్నామని చెప్పారు.

కొత్తగూడెం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, ఈ నెలలో బృందం పర్యటన కూడా ఉంటుందని చెప్పారు. అనంతరం సత్తుపల్లి మండలానికి చెందిన 59 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కార్య్ర  డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, కల్లూరు ఆర్డీవో ఎల్ రాజేందర్, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి ఎమ్మార్వో  యోగేశ్వరరావు పాల్గొన్నారు. 

ఎయిర్‌పోర్టు కోసం 20న స్థల పరిశీలన

భద్రాద్రి కొత్తగూడెం(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్టు కోసం స్థల పరిశీలన చేసేందుకు ఈ నెల 20న కేంద్ర బృందం పర్యటించనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇటీవల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహ యుభు ని కలిసి కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుపై చర్చించినట్టు తెలిపారు.

కొత్తగూడెం పరిధిలోని కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో భూములను గుర్తించామన్నారు. తమ విజ్ఞప్తి మేరకు కేంద్ర బృందం పర్యటించనున్నుట్లు వెల్లడించారు.