calender_icon.png 20 January, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం

20-01-2025 12:00:00 AM

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట, జనవరి 19 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్ కార్డులు అందుతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన, సమగ్ర సర్వే, గ్రామ సభ ఎక్కడ దరఖాస్తు చేసుకున్నా అర్హులకు కార్డులు అందుతాయన్నారు.

రేషన్‌కార్డులు, రైతు భరోస, ఇందిరమ్మ ఆత్మీయ భరోస, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు అధికారులు సర్వే నిర్వహించారని, ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లో అర్హుల పేర్లను ప్రదర్శిస్తారని తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అం దించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పా రు. అంతకు ముందు పాలకీడు మండలంలో నిర్వహించనున్న దర్గా ఉర్సు ఏర్పాట్ల ను మంత్రి పరిశీలించారు.

5,560 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు రూ.120 కోట్లతో ఏర్పాటు చేస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. హుజుర్‌నగర్‌లోని హౌసింగ్‌బోర్డు కాలనీ వద్ద ఐటీఐ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హౌసింగ్ కాలనీ నిర్మాణ పనులను పరిశీలించారు. లింగగిరి నుంచి కల్మలచెర్వు వరకు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్ తదితరులు పాల్గొన్నారు.