calender_icon.png 22 November, 2024 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్ నాయకులను అందించడమే లక్ష్యం

22-11-2024 03:07:52 AM

21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): భవిష్యత్ తరానికి నాయకులను సృష్టించడం, వారికి అవసరమైన శిక్షణ అందించడమే 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ లక్ష్యమని అకాడమీ చైైర్మన్ పీ కృష్ణప్రదీప్ పేర్కొన్నారు. గురువారం మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో జీ5 మీడియా గ్రూప్, 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ సంయుక్తంగా మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ సాధించటం ఎలా? ‘-యూపీఎస్సీ మాస్టర్ క్లాస్’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ ప్రదీప్ విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతూ.. ఇతరులు మన గురించి తెలుసు కునేలా ఎదగాలని, అందుకోసం యూపీఎస్సీ సాధించాలని చెప్పారు.

దేశం కోసం అజిత్ ఢోవల్ అనే ఐపీఎస్ అధికారి గురించి ఉదాహరణగా పేర్కొంటూ.. పాకిస్తాన్‌లో గూఢచారి (నిఘా అధికారి)గా పనిచేసి, భారతదేశానికి అత్యంత రహస్యమైన సమాచారాన్ని చేరవేశారని చెప్పారు. అకాడమీ చీఫ్ మెంటర్ డాక్టర్ భవానీ శంకర్ మాట్లాడుతూ.. యూపీఎస్సీ పరీక్షల్లో ప్రాథమిక తరగతుల ప్రశ్నలు కూడా వస్తాయని, అందులోని ప్రశ్నలన్నీ చాలా కఠినమైనవన్న భావనను వీడాలని చెప్పారు.

కేవలం 35 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ పరీక్షలకు అర్హులని స్పష్టం చేశారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగితే యూపీఎస్సీ సాధించడం తేలికన్నారు. సెమినార్‌లో సీఎమ్‌ఆర్‌ఈసీ సెక్రటరీ శ్రీశైలం రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఏఎస్ రెడ్డి, డాక్టర్ లక్ష్మయ్య, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ హెడ్ డాక్టర్ విజయ్ కార్తీక్ , జీ5 మీడియా డైరెక్టర్ ఐఎన్ గిరి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.