calender_icon.png 8 April, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందూ ధర్మ పరిరక్షణనే లక్ష్యం

08-04-2025 12:00:00 AM

అధ్యక్షుడు నాగపురి వెంకటేశ్‌గౌడ్

హనుమకొండ, ఏప్రిల్ 7 (విజయ క్రాంతి): శ్రీరామనవమిని పురస్కరించుకొని హిందూ సేవ సమితి ఆధ్వర్యంలో ఓరుగల్లు నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన, హిందూ విజయ యాత్ర కాజీపేట కడిపికొండ బ్రిడ్జి వద్ద ప్రారంభమై వరంగల్ దుర్గేశ్వరాలయంలో పూర్తయింది. హిందు సేవ సమితి అధ్యక్షులు నాగపురి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ శ్రీరాముని జీవితమే మానవాళికి ఆదర్శం అన్నారు.

ఎక్కువ సంఖ్యలో తరలివచ్చిన  హిందూ బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పూజనీయ స్వామీజీ శ్రీకృష్ణ చరణానంద స్వామిజి మాట్లాడుతూ హిందూ మతం కాదు ఇది ఒక జీవన విధానం అని అన్నారు మరో ముఖ్య అతిథి డాక్టర్ తరుణ్ రెడ్డి  మాట్లాడుతూ శ్రీరాముడు సకల గుణాభిరాముడు అతని జీవితం భారతీయ ప్రజలకు ఆదర్శప్రాయం అన్నారు.  రఘువీర్ రెడ్డి,  భూపాల్, రానా యాదవ్, నవీన్, రవి, సాగర్, వెంకట్, నిఖిల్, వెంకట్రావు, నవీన్ గోగికర్, క్రాంతి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.