calender_icon.png 26 April, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోమల నివారణే లక్ష్యం

26-04-2025 12:20:22 AM

మలేరియా దినోత్సవం సందర్భంగా ఆశ వర్కర్ల ర్యాలీ 

నిజామాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): దోమల నివారణకు అందరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ  పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం  జిల్లా స్థాయి ప్రచార ర్యాలీని నిజామాబాద్ పట్టణంలోని దుబ్బ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

ర్యాలీ అనంతరం ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో మాట్లాడుతూ.. దోమల వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా, ఫైలేరియా, మెదడువాపు లాంటి వ్యాధుల నివారణకు ఆరోగ్య కార్యకర్తలు కృషిచేయాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి రక్త నమోనాలు సేకరించి, మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స ఇవ్వాలని కోరారు. 

కార్యక్రమంలో జిల్లా కీటక జనీత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ తుకారం, వైద్యాధికారులు డాక్టర్ శ్రీలత, డాక్టర్ సుసేన, డాక్టర్ శిఖరా, డాక్టర్ చంద్రకళ, జిల్లా ఆరోగ్య విద్య బోధకులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ మలేరియా అధికారి మహమ్మద్ సలీం, సబ్ యూనిట్ అధికారి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.