calender_icon.png 3 April, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం!

25-03-2025 01:40:57 AM

అవగాహన ర్యాలీలో వైద్యాధికారిణి స్వరాజ్యలక్ష్మి 

నాగర్ కర్నూల్ మర్చి 24 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని మారుమూల పల్లెల నుండి పట్టణాల వరకు క్షయ రహిత జిల్లాగా మార్చడమే వైద్యాధికారుల ప్రధాన లక్ష్యమని నాగర్ కర్నూల్ జిల్లా వైద్యాధికారిని స్వరాజ్యలక్ష్మి అన్నారు. సోమవారం పా త కలెక్టరేట్ ఆవరణలో ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినం సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ రెండు వారాలుగా ఎడతెరిపిలేని దగ్గు, సాయంత్రం పూట జ్వరం రావడం, బరువు, ఆకలి తగ్గిపోవడం, కళ్ళేలో రక్తం పడడం తదితర లక్షణాలు, సంపూర్ణ చికిత్స గురించి క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సికిల్ సెల్ అనిమియా అంశంపై మండలాల వై ద్యాధికారులకు అవగాహన శిక్షణ ఏర్పాటు చేశారు.

జన్యుపరమైన లోపం వలన తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుందని సాధారణంగా ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు ఉంటుంది కానీ సికిల్ సెల్ వ్యాధితో బాధపడే వారికి ఎర్ర రక్త కణాల జీవితకాలం 10-20 రోజులు మాత్రమే ఉంటుందన్నారు.