calender_icon.png 15 May, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీని టీబి రహిత గ్రామ పంచాయతీగా మార్చడమే లక్ష్యం

10-04-2025 10:45:26 PM

కల్లూరు (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా క్షయ నిర్మూలన అధికారి డాక్టర్ సుబ్బారావు ఆదేశాల మేరకు కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. నవ్యకాంత్ సహకారంతో కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల తూర్పు లోకారం గ్రామ పంచాయతీలో టీబీ వ్యాధిపై అవగాహన నిర్వహించి, టీబీ వ్యాధి లక్షణాలున్న వారి నుంచి కళ్ళే నమూనాలు సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టీబీ నోడల్ అధికారి రామారావు మాట్లాడుతూ.. కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రతి పంచాయతీని టీ.బి. ఫ్రీ పంచాయతీగా మార్చడం కోసం టీబీ నిర్మూలన విభాగంలోని టీబీ చికిత్స సూపర్వైజర్ వై.సురేష్, ల్యాబ్ సూపర్వైజర్ సంజీవ్ కుమార్, వైద్య సిబ్బంది సహకారంతో పనిచేస్తున్నామని తెలియజేశారు.

అలాగే తూర్పు లోకారం గ్రామపంచాయతీని టీబీ ఫ్రీ పంచాయతీగా మార్చడం కోసం కృషి చేస్తున్నామని, అందుకు ప్రజలు టీబీ వ్యాధిపై పూర్తి అవగాహన కలిగి ఉండి, టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, టీబీ రాకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు, తీసుకోవాల్సిన పౌష్టిక ఆహారం గురించి వివరించారు. టీబీ వ్యాధి అంటరాని వ్యాధి కాదని అంటువ్యాధి మాత్రమేనని, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు నోటికి కర్చీఫ్ అడ్డుపెట్టుకోవడం వల్ల టీబీ వ్యాధి పక్కవారికి వ్యాపించదని తెలియజేశారు. టీబీ వ్యాధికి  సంబంధించిన మందులు, పరీక్షలు పూర్తి ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ టీ.వీ సత్యనారాయణ, ఏఎన్ఎం విజయలక్ష్మి నిర్మల, ఆశా కార్యకర్తలు జమలమ్మ రాణి, లక్ష్మి, పాల్గొన్నారు.