calender_icon.png 6 March, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెంపొందించడమే లక్ష్యం

06-03-2025 07:32:25 PM

ప్రొఫెసర్ డాక్టర్ చెన్నప్ప..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు భారత రంగ నైపుణ్య మండలి(BFSI)లతో తెలంగాణ కామర్స్ అసోసియేషన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) చేసుకున్నట్లు తెలంగాణ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ చెన్నప్ప తెలియజేశారు. గురువారం BFSI భారత రంగ నైపుణ్య మండలితెలంగాణ కామర్స్ అసోసియేషన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందం BFSI రంగంలో నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ-అకడమిక్ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెంపొందించడం లక్ష్యంగా కలిగి ఉందని పేర్కొన్నారు.

ఈ అవగాహన ఒప్పందంపై BFSI భారత రంగ నైపుణ్య మండలి నేషనల్ హెడ్ శ్రీ నబ్రూన్ చక్రవర్తి, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ చెన్నప్ప సంతకం చేశారు. ఈ ఒప్పందం విద్యార్థులకు BFSI రంగంలో మెరుగైన శిక్షణ, కెరీర్ అవకాశాలు అందించేందుకు దోహదపడుతుంది. BFSI భారత రంగ నైపుణ్య మండలితెలంగాణ కామర్స్ అసోసియేషన్ మధ్య ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో మరిన్ని విద్యా, పరిశ్రమ అనుసంధాన కార్యక్రమాలకు దారి తీయనుంది. ఈ సమావేశంలో డాక్టర్ రాజ్ కుమార్ (హెడ్, కామర్స్ విభాగం, పాలమూరు విశ్వవిద్యాలయం), శ్రీనాథ్ గట్టు (జోనల్ హెడ్ - దక్షిణ ప్రాంతం, BFSI (Sector Skill Council of India), డాక్టర్ బి. రామేశ్వర్ రావు (అడ్వైజర్, BFSI Sector Skill Council of India, తెలంగాణ), డాక్టర్ అనురాధ రెడ్డి, డాక్టర్ కుమార స్వామి, డాక్టర్ అర్జున్ కుమార్, డాక్టర్ నాగ సుధ, డాక్టర్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.