calender_icon.png 26 March, 2025 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యం

26-03-2025 02:01:07 AM

జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మార్చి 25: వాన నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంచడమే వాటర్ షెడ్ పథకం ముఖ్య ఉద్దేశమని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు.మంగళవారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ పాఠశాలలో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన వాటర్ షెడ్ యాత్రను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వివి అప్పారావు ఆధ్వర్యంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షపు నీటిని వృధా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని,ఎత్తున ప్రాంతాలలో కంధకాల పనులను వాలుకు అడ్డుగా మట్టికట్టలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.నీటి నిల్వ పనులను చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే భూగర్భ జలాలు ఎండిపోయి త్రాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని అన్నారు.

వర్షం నీటిని కుంటలు,చెరువులలో నిలువ చేసుకుంటే దాని కింద ఉన్నటువంటి బావుల్లో,బోర్లలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండి అదనపు వ్యవసాయం సాగులోకి వస్తుందని చెప్పారు.అలాగే నీటి నిల్వ పనులు అనగా పారంపాడ్స్,చిన్న ఊటకుంటలు,రాతి డ్యాములు,చెక్ డ్యాములు ఏర్పాటు చేసుకొని పళ్ళతోటల పెంపకం,చెట్ల పెంపకం లాంటి పనులను చేసుకోవాలని కోరారు.

అంతకుముందు కళాకారులు గ్రామ ప్రజలు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.అనంతరం పాఠశాలలో 8,9వ తరగతి విద్యార్థులకు వాటర్ షెడ్స్ గురించి పోటీ పరీక్షలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ టి గోపి,ఏపీఓ ఉపేందర్,ఐకేపీ ఏపిఎం మల్లేష్,మండల విద్యాధికారి బాలునాయక్ పాఠశాల హెచ్‌ఎం లు కుంభం ప్రభాకర్, చంద్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శి, కళాకారులు, టిఏలు, ఎఫ్‌ఏలు ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.