calender_icon.png 23 December, 2024 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనాతన బోర్డు ఏర్పాటే లక్ష్యం

23-12-2024 02:52:40 AM

హింధూ ధర్మాన్ని రక్షించాలి

 సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభలో 108 పీఠాధిపతుల సందేశం

పటాన్‌చెరు, డిసెంబర్ 22: భారత దేశం, హిందూ ప్రజల రక్షణకు సనాతన బోర్డు ఏర్పాటే  లక్ష్యమని 108 మంది పీఠాధిపతులు స్పష్టం చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజక వర్గంలోని బీరంగూడ భ్రమరాంభ మల్లికార్జునస్వామి గుట్టపై సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి 108 మంది పీఠాధిపతులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడుతూ.. భారత దేశంలో హిందూ ధర్మంపైన, హిందూ దేవాలయాలపైనా తరుచూ దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాలంటే సనాతన బోర్డు ఏర్పాటే చేసుకోవడమే ప్రధానమన్నారు. పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు అతీతంగా బోర్డు ఏర్పాటు కోసం పని చేయాలన్నారు.

సనాతన బోర్డు ఏర్పాటయ్యే వరకు ఇక తరుచూ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు అంజిరెడ్డి, అమీన్‌పూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ఈర్లరాజు, భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్‌యాదవ్, కమిటీ సభ్యులు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.