calender_icon.png 6 January, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదరిక నిర్మూలనే లక్ష్యం

04-01-2025 01:51:48 AM

  1. ఎక్కడున్నా తెలుగువారంతా ఒక్కటే
  2. ప్రతీ ఇంటినుంచి ఓ పారిశ్రామికవేత్త ఎదగాలి
  3. బ్రెయిన్ డ్రెయిన్.. బ్రెయిన్ గెయిన్ అవుతుందని చెప్పా
  4. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): మన దేశం నుంచి చాలామంది విదేశాలకు వెళ్లిపోతున్నారని దీంతో దేశం మేథో సంపత్తిని కోల్పోతోందని చాలా మంది అన్నారని, అయితే బ్రెయిన్ డ్రెయిన్ కాస్త బ్రెయిన్ గెయిన్‌గా మార్పుచెందుతుందని తాను ఆనాడే చెప్పానని, అది ఇవాళ నిజమైందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.

నాలెడ్జ్ ఎకనమీలో తెలుగువారు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుం చి పాలమూరు వరకు తెలుగువారు ఎక్కడున్నా ఒకటేనని తెలిపారు.

అమెరికన్ తెలుగు ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ప్రాంతం గొప్ప ఐటీ సిటీగా మారుతుందని తాను అప్పుడే ఊ హించానని, విజన్ 2020 తయారు చేసుకొని ముందుకు వెళ్లామన్నారు.

ఏఐ, డీప్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.. 

వికసిత్ భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ విజన్-2047 ప్రణాళిక సిద్ధం చేశారని, 2047 నాటికి దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా మారుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఏఐ, డీప్ టెక్నాలజీని తెలుగువాళ్లు అందిపుచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఎదగాలన్నారు. పెట్టుబడుల కంటే ఐడియాలు చాలా ముఖ్యమన్నారు.

దేశం లో పేదరిక నిర్మూలనే మన అందరి లక్ష్యం కావాలన్నారు. ఇప్పటి అనేక మౌలిక సదుపాయాలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ రూపంలో వచ్చాయని.. కానీ దీని వల్ల కోట్ల మంది సంపాదించి ధనవంతులు అయ్యారని... ఇదే సమయంలో పేదవాళ్లు పేదవా రిగానే ఉండిపోతున్నారన్నారు. ప్రైవేట్ పీపుల్ పార్ట్‌నర్‌షిప్ ద్వారా మాత్రమే జీరో పావర్టీ సాధ్యమన్నారు.

ఇక్కడున్న వారంతా మీకు నచ్చిన పది కుటుంబాలకు అండగా నిలబడాలని... అదే నిజమైన సమాజసేవ అని అన్నారు. అధికంగా సంపాదిస్తున్న వా రు 10 శాతం మంది పేదలను దత్తత తీసుకోవాలన్నారు.

ప్రస్తుతం దక్షిణ భారత దేశం లో జనాభా తగ్గిపోతున్నదని, దక్షిణ కొరి యా, జపాన్, చైనా, జర్మన్ వంటి అగ్రదేశా లు జనాభా తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. జనాభా విషయంలో జాగ్రత్త పడగలిగితే ఈ ప్రపంచాన్ని పరిపాలించే శక్తి భారతదేశానికే ఉంటుందన్నారు. 

ఐటీ అంటే అప్పుడు నవ్వారు...

ప్రపంచంలోనే మేటి నగరంగా హైదరాబాద్ మారిందంటే తమ దూరదృష్టే కారణమని చంద్రబాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వం వేసిన పునాది వల్లే ఇక్కడ ఆదాయం పెరిగిందన్నారు. ప్రస్తుతం దేశ విదేశాల్లో తెలుగువాళ్లు గొప్పగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు ఐటీ అంటే అనేక మంది ఐటీ తిండి పెడుతుంతా అని ఎగతాళి చేశారని అన్నా రు.

కానీ ఇప్పుడు విదేశాల్లో అనేక మంది తెలుగు వారు పారిశ్రామికవేత్తలుగా మారారని గుర్తుచేశారు. అమెరికాలో మన తెలుగువాళ్లే ఎక్కు వ ఆదాయం సంపాదిస్తున్నారని చెప్పారు. సెల్ ఫోన్లను ప్రమోట్ చేస్తే ఏమన్నా ఉపయోగమా అని ప్రశ్నించారని, కానీ ఇప్పుడు టెక్నాలజీలో తెలుగువారు దూసుకుపోతున్నారని అన్నా రు. ప్రపంచవ్యాప్తంగా ఐటీలో రాణిస్తున్న తెలుగువారు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు.