calender_icon.png 29 December, 2024 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి, డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యం

29-12-2024 02:30:27 AM

* జీహెచ్‌ఎంసీ సహా ఖమ్మం, మెదక్‌పై ప్రత్యేక దృష్టి

* ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి

* తెలంగాణ ఎక్సైజ్ వార్షిక నివేదిక విడుదల

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28(విజయక్రాంతి): గంజాయి, డ్రగ్స్ నిర్మూలనే తమ ప్రధాన లక్ష్యమని ఎక్సైజ్ ఎన్  డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్రగ్స్, గంజాయి, హాట్‌స్పాట్లను గుర్తించామని ఆయన తెలిపారు. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని మహాత్మా గాంధీ సెంటి  హాల్‌లో  తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వార్షిక నివేదికను కమలాసన్‌రెడ్డి  విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తుపదార్థాలు, ఎన్డీపీ లిక్కర్ నియంత్రణలో భాగంగా జీహెచ్‌ఎంసీ సహా ఖమ్మం, మెదక్, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. 

డ్రగ్స్, గంజాయి, ఎన్డీపీ(నాన్ డ్యూటీ పెయి  లిక్కర్) మద్యం తదితర అంశాలపై ఎక్సైజ్ శాఖలోని చాలా విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిపై నిఘా ఉంచి చేస్తున్న తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. టీజీఏఎన్‌బీ, పోలీసులతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహించిన దాడుల్లో రూ.12కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ ఏడాదిలో గతం కంటే కేసులు 29 శాతం, అరెస్ట్‌లు 62శాతం, వాహనాల సీజ్ 78శాతం పెరిగిందని పేర్కొన్నారు.  

కోర్టుల్లో వీగిపోతున్న కేసులు 

రాష్ట్ర వ్యాప్తంగా 1,118కేసుల్లో 1991  అరెస్ట్ చేయడంతో పాటు 505 వాహనాలు సీజ్ చేశామని, ఈ కేసుల్లో 6,331 కిలోల గంజాయి, 736 గంజాయి మొక్కలు, 37 కిలోల ఆల్ఫాజోలంను పట్టుకున్నట్లు తెలిపారు. ఏండ్ల తరబడి చాలా కేసులు కోర్టుల్లో వీగిపోతున్నాయని వెల్లడించారు. 1,393 కేసుల్లో రూ.48.54 కోట్ల విలువైన మత్తు పదార్థాల దహనం చేసినట్లు చెప్పారు. 854 ఎన్డీపీ లిక్కర్ కేసుల్లో, 463మందిని అరెస్ట్ చేసి రూ.1.35కోట్ల విలువైన 11,322 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసు  80 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. జనవరి, జూన్, సెప్టెంబర్‌లో డ్రగ్స్  స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించామన్నారు.

రాజస్థాన్, బీహార్, యూపీ తదితర ప్రాంతాల నుంచి గంజాయి చాక్లెట్లు సరఫరా అవుతున్నాయని, దాదాపు 99.42 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేసుల్లో 14,711 మందిని బైండోవర్లు చేశామని కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. నైపుణ్యాన్ని పెంచడం కోసం 2,513 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

ఆపరేషన్ ధూల్‌పేట్‌తో సత్ఫలితాలు

ఈ ఏడాది జూలై 17న ప్రారంభించిన ఆపరేషన్ ధూల్‌పేట్ సత్ఫలితాలిస్తున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ధూల్‌పేట్ పూర్తిగా ఎక్సైజ్ కంట్రోల్‌లో ఉందని చెప్పారు. ఈ ఏడాది ధూల్‌పేట్‌లో 317 మందిపై 71 కేసులు నమోదు చేసినట్లు, 317కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. 245 మంది రిమాండ్‌లో ఉన్నట్లు తెలిపారు. 14 సార్లు పోలీస్, ఎక్సైజ్ జంటగా దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ధూల్‌పేట్‌లో గంజాయి దందా చేసే వారందరూ జైళ్లలో ఉన్నట్లు పేర్కొన్నారు.

15కుటుంబాలకు చెందిన వారే గంజాయి విక్రయాలు సాగిస్తున్నారని తెలిపారు. అలాంటి వారిలో అంగూరి బాయి అనే మహిళను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో పలువురు ధూల్‌పేట్ నుంచి నగర శివార్లకు వెళ్లి గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. నానక్‌రామ్‌గూడలో నీతూబాయి అనే బడా గంజాయి విక్రేతను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

92 మండలాల్లో ఐడీ లిక్కర్(గుడుంబా) తయారీ 

రాష్ట్ర వ్యాప్తంగా 25 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 92 మండలాల్లో ఐడీ లిక్కర్(గుడుంబా) తయారీ జరుగుతున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గుర్తించిందన్నారు. వరంగల్, హైదరాబాద్, నల్లగొండ, మహబూ  జిల్లాలో అలాంటి 539 హాట్ స్పాట్లు ఉన్నాయని తెలిపారు. ఏపీ నుంచి కూడా కొత్తగూడెం ప్రాంతానికి భారీగా సరఫరా అవుతున్న ఐడీ లిక్కర్‌ను ఏపీ ఎక్సైజ్ అధికారులతో కలిసి ధ్వంసం చేసినట్లుకమలాసన్‌రెడ్డి తెలిపారు, న్యూఇయర్ వేడుకలపై నిఘా

నూతన సంవత్సర వేడుకలపై ఎక్సైజ్ నిఘా ఉంటుందని, అందుకోసం 40 ప్రత్యే  బృందాలను ఏర్పాటు చేశామని కమలాసన్‌రెడ్డి తెలిపారు. అందులో 17 బృందాలు టీజీన్యాబ్, పోలీసులతో కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. వారి చెకింగ్ వివరాల రిపోర్టును ప్రతి గంటకు పోలీసులతో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తామన్నారు. రియల్‌టైం బేసిస్‌లో మానిటరింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్లు ఖురేషీ, శాస్త్రి, డీసీ దశరథ్ పాల్గొన్నారు. 

పబ్‌లు, బార్లు, ఎన్డీపీ మద్యంపై ప్రత్యేక నజర్

పబ్‌లు, బార్లలో.. డ్రగ్స్, గంజాయి వినియోగం జరుగుతుందని తమకు వచ్చిన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించామని కమలాసన్‌రెడ్డి చెప్పారు. డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. గోవా, మర్యానా, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి వాహనాలు, రైళ్లు, ఎయిర్‌పోర్టుల నుంచి సరఫరా అవుతున్న ఎన్‌డీపీ లిక్కర్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తు  తెలిపారు.

ఈవెంట్లపై నిఘా ఉంచామని చెప్పారు. పలు సందర్భాల్లో ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అన్‌లైసెన్స్‌డ్ స్టాక్ పాయింట్ల(బెల్టు షాపుల)పై 6,915 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సెకండరీ డిస్లరీస్ నుంచి ఎన్డీపీ మద్యం బయటకు పోకుండా నిఘా ఉంచుతున్నామని వెల్లడించారు.