24-03-2025 12:00:00 AM
ప్రత్యామ్నాయ బహుజన పార్టీ అధ్యక్షుడు ప్రొ.ప్రభంజన్ యాదవ్
ముషీరాబాద్, మార్చి 23: (విజయక్రాం తి):మహనీయుల స్ఫూర్తితో బహుజనులకు ఓటు చైతన్యం కల్పించి ప్రజాస్వామ్య పరిరక్షణ, సామజిక న్యాయం, రాజ్యాధికారం సాధించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ బహుజన రాజకీయ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ అన్నారు. ఈ మేర కు ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యామ్నాయ బహుజన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించారు.
ఈ సందర్బంగా ప్రభంజన్ యాదవ్ మాట్లాడుతూ ఫూలే, అంబేద్కర్ ఆలోచన విధానం, కాన్షిరాం కార్యాచరణతో ముందుకు సాగుతామన్నారు. సమావేశం లో భవిష్యత్ కార్యాచరణ వివరించారు. అనంతరం పార్టీ తాత్కాలిక రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పార్టీ ఉపాధ్యక్షుడి గా డాక్టర్ ఎన్ పి.వీరస్వామి, ప్రధాన కార్యదర్శిగా వద్దిరాజు స్వర్ణలత, కోశాధికారిగా తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా కే.సత్యనారాయణ, ప్రజాపతి, ఉగ్గం వెంకట్, ఇ.శనిగరపు బాలకృష్ణ, కార్యవర్గ సభ్యులుగా ముక్కు నర్సయ్య, అనిల్, రాజు, పార్టీ సలహాదారులుగా ప్రొఫెసర్ ననుమా స స్వామి, సుతారి లచ్చన్న, బడే సాహెబ్, గొడ్డెటి గంగయ్య ఎన్నికయ్యారని తెలిపారు. ఈ సమావేశంలో తాత్కాలిక కమిటీ సభ్యులు, సలహాదారులు పాల్గొన్నారు.