23-03-2025 01:02:42 AM
పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): పర్యాటక రంగ అభివృ గత పదేళ్లు ఎలాంటి పాలసీలేదని, కానీ తాము టూరిజం అభివృద్ధికి నూతన విధానాన్ని తీసుకొచ్చామని పర్యాటక, సాం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నా రు. పర్యాటకులు, పెట్టుబడులను ఆకర్షిం లక్ష్యమని వెల్లడించారు.
ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమ యంలో పర్యాటక అభివృద్ధిపై సభ్యు లు అడిగిన ప్రశ్నలకు మంత్రి జూపల్లి సమాధానమిచ్చారు. ఆలయాలు, పర్యావరణం, సాహస, జల క్రీడలు తదితర అంశాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.
పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 3 లక్షల ఉద్యోగాలను సృష్టించడంతో పాటు 2030 నాటికి 10 కోట్ల దేశీయ పర్యాటకులు, 5 లక్షల అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా నూతన పర్యాటక విధానాన్ని తీసుకొచ్చామన్నారు. పర్యాటక అభివృద్ధికి 5 సంవ త్సరాల దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరచుకుని ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని చెప్పారు.