calender_icon.png 3 February, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ సాధనే లక్ష్యం

03-02-2025 12:00:00 AM

సూర్యాపేట, ఫిబ్రవరి 2 : ఎస్సీ ఏ,బి,సి,డి వర్గీకరణ మా లక్ష్యం అని టిఎమ్మార్పిఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ అన్నారు. ఈ నెల 7న నిర్వహించ నున్న లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమ విజయవంతానికై సంఘ జిల్లా అధ్యక్షులు పుట్టల శ్రావణ్ కుమార్ మాదిగ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎస్సీ వర్గీకరణ కోసం నిర్వహించే లక్ష డప్పులు వేల గొంతుల సాంస్కృతిక ప్రదర్శనకు టిఎమ్మార్పిఎస్ పూర్తి మద్దతు ప్రకటిస్తుంద న్నారు.  టిఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్దాస్ శంకర్, పట్టణ అధ్యక్షులు పిడమర్తి మధు మాదిగ,  ఏం ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మీసాల శివరామకృష్ణ మాదిగ, చివేముల మండల అధ్యక్షులు యడవల్లి రాము, ఆత్మకూర్ ఎస్ మండల అధ్యక్షులు బొల్లె అశోక్, మండల ఉపాధ్యక్షులు సూరారపు నాగయ్య తదితరులు పాల్గొన్నారు.