10-03-2025 11:28:47 PM
వ్యాపార వేత్తలుగా రాణించేలా ప్రోత్సాహం..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.
అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందేలా మహిళలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. జూబ్లీహిల్స్ సర్కిల్‌కు చెందిన స్నేహిత స్వయం సహాయక సంఘానికి చెందిన ఐదుగురు మహిళలు రూ.5లక్షల ఆర్థిక సహకారంతో ఈ క్యాంటీన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కార్యక్రమంలో యూసీడీ అడిషనల్ కమిషనర్ చంద్రకాంత్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, డీసీ ప్రశాంతి, ఎస్బీఐ అమీర్‌పేట్ బ్రాంచి మేనేజర్, స్వయం సహాయక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.