calender_icon.png 31 January, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సీపీఎస్’ రద్దే లక్ష్యం

30-01-2025 01:49:09 AM

  • అప్పటి వరకూ పోరాటం ఆగదు
  • ‘కరీంనగర్’ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య 

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): ఉపాధ్యాయులు, ఉద్యోగులకు శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానాన్ని రాష్ర్ట ప్రభుత్వం రద్దు చేసే వరకూ పోరాటం చేస్తానని కరీంనగర్ నిజామాబాద్ మెదక్  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మల్క కొమురయ్య స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేసి..

ఓపీఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీసీపీఎస్‌ఈఏ) రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుప్పాల కృష్ణ కుమార్, హనుమండ్ల భాస్కర్ తదితరులు కొమురయ్యను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కొమురయ్య మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ సీపీఎస్‌ను రద్దు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుందనీ..

అయినా ఇప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదన్నారు. సీపీఎస్ విధానం రద్దు చేసుకునే అవకాశం రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగుల జీవితాలకు భద్రతలేని సీపీఎస్ విధానం రద్దు చేయాలని, లేకపోతే.. ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో తపస్ రాష్ర్ట అధ్యక్షుడు హన్మంతరావు పాల్గొన్నారు.