calender_icon.png 25 November, 2024 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీల సంక్షేమమే లక్ష్యం

25-11-2024 01:47:11 AM

ఎస్పీ రోహిత్‌రాజు

మణుగూరు, నవంబర్ 24: మారుమూల గ్రామాల్లో నివసించే ఆదివాసీల ప్రజల సంక్షేమమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. పినపాక నియోజకవర్గం అశ్వాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గల వేములూరు గ్రామంలో ఆదివాసీ ప్రజలకు ఆదివారం భద్రాచలం రోటరీ క్లబ్, పోలీసుశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లోని ఆదివాసీ ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని  వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మావోయిస్టులు తమ మనుగడ కోసం ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.

మావోయిస్టులకు ఎలాంటి సహకారం చేయవద్దని సూచించారు. ఈ మెడికల్ క్యాంపునకు 7 గుత్తి కోయ గ్రామాల నుంచి వచ్చిన 400 కుటుంబాలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో మణు గూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, అశ్వాపురం సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సైలు తిరుపతి, రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.