calender_icon.png 2 April, 2025 | 12:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బీసీ ఎస్సీ, ఎస్టీల రాజ్యాధికారమే లక్ష్యం

31-03-2025 11:29:42 PM

ముషీరాబాద్: తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం స్థాపించడానికే జేఏసీని ఏర్పాటు చేయడం జరిగిందని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ సమన్వయకర్త డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. ఈ మేరకు సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సభ జరిగింది. ఈ ఆవిర్భావ సభకు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ తిరుమలి, ఏపీ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ఓయూ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ రామయ్య యాదవ్‌ల చేతుల మీదుగా ఆవిర్భావం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలకు భూమి లేనప్పుడు ఆ నీళ్లు ఎవరి పొలంలో పారాలి ? పన్నులు కట్టేది బీసీ ఎస్సీ ఎస్టీలు కానీ ఆ పనుల ద్వారా వచ్చిన సొమ్మును మాత్రం అగ్రవర్ణాలు దోచుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.