calender_icon.png 19 March, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమిలి ఎన్నికలే లక్ష్యం

19-03-2025 02:37:03 AM

వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర్ రావు

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 18 (విజయ క్రాంతి): ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదంతో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమ వుతుందని జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం తో కలిసి 16 మండలాల వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్లు, కో కన్వీనర్లతో జిల్లాస్థాయి కార్య శాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్ సభ అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ద్వారా ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. పరిపాలన సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యంగా బిజెపి పార్టీ 1984 నుండి ప్రోచేస్తుందని తెలిపారు. పార్లమెంటులో మెజార్టీ లేకపోవడంతో గతంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ముందుకు వెళ్లలేదని తెలిపారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు నిర్వ హణ కోసం  క్యాబినెట్లో ఆమోదం తెలప డంతో పాటు పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టడం జరిగిందని వివరించారు. క్షేత్రస్థా యిలో ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదాన్ని తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చర్ల మురళి, సీనియర్ నాయకులు బోనగిరి సతీష్ బాబు, రాజేందర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.